మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఐసీయూలో సోమవారం రాత్రి ఓ అనాథ వృద్ధ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు. కర్ణాటక కేజీఎఫ్ చెందిన రామస్వామి భార్య తాయమ్మ (70) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక వచ్చేసి మదనపల్లె పట్టణంలో ఉండేది. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు 108కు సమాచారం అందించడంతో 10 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తాయమ్మ మృతి చెందింది.