నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించేవారని, తాను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత.. ఆయన బూతులు మాట్లాడకుండా మార్చగలిగానని చెప్పారు. సంకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. తాను గెలుపోటములతో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండేందుకే వచ్చానన్నారు.
![]() |
![]() |