మ్యానిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని మా నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పేదల బతుకులు మార్చే మేనిఫెస్టో విడుదలైన క్రమంలో ప్రతీ ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని బొత్స సత్యనారాయణ కోరారు. ఇవాళ వైయస్ఆర్‌సీపీ 2024 మేనిఫెస్టో విడుదల చేయడం పట్ల ఆయన స్పందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.... 2019 ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో 99 శాతం అమలు చేశాం. పేద వాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికే మా మ్యానిఫెస్టో ఉంది. చంద్రబాబులా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యం. విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టాం. వచ్చే ఐదేళ్లు కూడా వాటిపై ఫోకస్ చెయ్యబోతున్నాం. మ్యానిఫెస్టో లో 99 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక పార్టీ వైయస్ఆర్‌సీపీ. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మ్యానిఫెస్టోని అమలు చేయలేదు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. ద్వాక్రా మహిళలకు కూడా మా ప్రభుత్వం బకాయిలు చెల్లించింది అని తెలిపారు.