బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్‌లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్‌లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్‌లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్‌లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్‌నే పెట్టారు. 2024 అఫిడవిట్‌లో సింగ్‌నగర్ పార్టీ ఆఫీస్‌ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్‌లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్‌లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు? అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.