చెరువులో పడి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివా రం మండలంలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా,పెద్ద మండ్యం మండలం పాపేపల్లె పం చాయతీ గుడిసివారిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, వరలక్ష్మి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా వారి కుమార్తె రుచిత(18) అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీంతో విద్యార్థిని చదువు కోసం వారు అంగళ్లకు వచ్చి స్థిరప డ్డారు. కాగా రెండు రోజుల కళాశాలలో జరిగిన కార్యక్ర మానికి హాజరై విద్యార్థిని ఆలస్యంగా ఇంటికి వచ్చిందన కుటుంబీకులు మందలించడంతో రాత్రి సమయంలో ఎవ్వరికీ చెప్పకుండా రామక్క వద్దకు వెళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా విద్యార్థిని తండ్రి తన కుమార్తె కనిపించలేదని శనివారం రాత్రి పోలీసుల కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కాగా స్థాని కులు ఆదివారం చెరువులో మృతదేహాన్ని చూసి పోలీ సులకు సమాచారం ఇవ్వగా అక్కడే ఉన్న వారు మృతదే హాన్ని వెలికితీశారు. స్థానిక ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాపత్రికి తర లించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మృతిచెందడంతో కుటుంభీకులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.