ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరందించడమే ముఖ్య లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ సమస్యలపై కిర్లం పూడిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ మాట్లాడారు. ‘మల్లవరం ప్రాజెక్టుకు రూ.132 కోట్లు అంచనా వేసి రెండుసార్లు శంకుస్థాపన చేసి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వీర్యమైపోయిందన్నారు. పోలవరం మట్టి గట్లను తవ్వేస్తున్నా జలవనరులశాఖ చోద్యం చూస్తుందని మండిపడ్డారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి 175 ఎకరాల దుస్లాం చెరువును వైసీ పీ ప్రతినిధులు ఆక్రమించేశారని తెలిపారు. గోకవ రంలో పంచాయతీ స్థలాల్లో లాడ్జిలు నిర్మించారన్నా రు. వైసీపీ శ్రేణులు రామేశ్వరంమెట్ట మట్టి తరలించుకుపోయి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం నీరురాక 30 వేల ఎకరాలు ఎండితున్నా కనీస స్పందన లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కిర్లంపూడికి డిగ్రీ కాలేజీ తెస్తాం. ఏలేరు ఆధునికీకరణ చేస్తాం. మల్లవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేస్తాం’ అని స్పష్టంచేశారు. జగన్ గత ఎన్నికల్లో కాపుల కు రిజర్వేషన్ ఇవ్వలేనని చేతులెత్తేశారని, అప్పుడు జగన్‌ను అడగలేకపోయారని, ఈ డబ్ల్యూసీ పథకం కింద టీడీపీ ఐదు శాతం ఇస్తే దాన్నీ వైసీపీ తుంగలోకి తొక్కిందన్నారు. ఇక్కడ ఉద్యమ నాయకులు సినిమాల్లో రంగులేసుకునే వార ని హేళన చేస్తున్నారు తప్పితే కాపులకు మంచి చేస్తే ఆనందపడేవాడినన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.