దేవరాపల్లి గ్రామానికి చెందిన 25 తెలుగుదేశం కుటుంబాలు, ఆ పార్టీకి, కూటమికి మరో షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సమక్షంలో మంగళవారం వైసిపిలో చేరారు. బూడి నాయకత్వం పట్ల విశ్వాసంతో నిరంతరం స్థానికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే ఆయన సారథ్యంలో దేవరాపల్లి మండల వ్యాప్తంగా ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.