చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీకి తక్షణం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. తమకు సెక్యూరిటీ కల్పించేలా తిరుపతి జిల్లా ఎస్పీ, పోలీసులను ఆదేశించాలని కోరుతూ పులివర్తి వెంకట మణిప్రసాద్ నానీ, ఆయన సతీమణి, కుమారుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa