ఒంగోలు నగరంలోని బ్యాంకుల వద్ద గురువారం ఉదయం నుండి పింఛన్ దారులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నెలలో పింఛన్ దారుల ఆధార నెంబర్ కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలకు ఆ నగదును ప్రభుత్వం జమ చేసింది. ఆ డబ్బులే ఆధారమైన వృద్ధులు బ్యాంకుల వద్దకు ఎండను సైతం లెక్కచేయకుండా వెళ్తున్నారు. ఒక్కసారిగా బ్యాంకులలో రద్దీ పెరగటంతో వారు నగదు డ్రా చేయడం కష్టంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa