అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత ప్రధాన కార్యదర్శి దురుషాంత్ కుమార్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారని.. దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే మాత్రం కచ్చితంగా రాజ్యాంగం మారుస్తారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు రాజ్యాంగం మార్పు విషయంపై వారి వైఖరిని ఓటర్లకు చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రధాని మోదీ చెప్పారన్నారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారు.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీసీ కుల గణన చేయడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. ల్యాడ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజల్లో , లాయర్లకు, కొన్ని రాజకీయ పార్టీలకు అనుమానం ఉందని తెలిపారు. ఈ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని వైసీపీ చెబోతోందన్నారు. ఈ యాక్ట్‌ను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేదన్నారు. జగన్ వెంటనే ఈ యాక్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫించన్ల పంపిణీలో సచివాలయం ఉద్యోగులను, టీచర్లను ఉపయోగిస్తే పంపిణీ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఫించన్ల కోసం వెళ్లి 7 మంది చనిపోయారని.. వీరి ఉసురు అధికారంలో ఉన్న అధికారులకు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు.