ఏలూరు నగరంలో 40వ డివిజన్లో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గం దాడి చేశారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ..... తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది. దీంతో టీడీపీ శ్రేణులు ఏలూరు ఆసుపత్రికి తరలించారు. 40 వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ తుమ్మరాడ స్రవంతి తన అనుచరులతో దాడి చేయించిందని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. సోమవారం జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు ఆమె దాడి చేయించిందని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంలో పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.