ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతున్నదని, సంతానోత్పత్తి రేటు పడిపోతుండటమే దీనికి కారణమని ‘లాన్సెట్’ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో 1950లో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేదని.. 2021 నాటికి అది 2 కంటే తక్కువకు పడిపోయినట్లు వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, అదే 2100 నాటికి 1.04కు పడిపోవచ్చని హెచ్చరించింది.