నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, పరికోట గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములను రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా మారుస్తూ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. పిటిషనర్ల భూముల విషయంలో కలగజేసుకోవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భూముల సమగ్ర రీసర్వే పేరుతో నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, పరికోట గ్రామం పరిధిలో సర్వే నంబర్ 227-1, 227-2 పరిధిలో తమ ఆధీనంలో ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా మార్చారంటూ కోట మహేశ్వరరెడ్డి, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి... రికార్డుల్లో పేర్లను మారుస్తూ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు.