సాధారణ ఎన్నికలు– 2024లో భాగంగా కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వివరించారు. ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాలు నుంచి కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఏలూరులోని కలెక్టరేట్ లోని వీసీ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, జేసీ లావణ్య వేణి, ఐటీడీఏ పీవో సూర్యతేజ, డీఆర్వో పుష్పమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధా రణ ఎన్నికలు– 2024లో భాగంగా ఎన్నికల కమిషన్ నిబం ధనల ప్రకారం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేపడుతు ్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నా మన్నారు. సీపీటీవీ కెమేరాలను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, కౌంటింగ్ కోసం అడిషినల్ ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో పరిశీలకులను నియమించామని, మొదటి ర్యాండమైజేషన్, శిక్షణ ఈనెల 27న నిర్వహిస్తామన్నారు. వివిధ నియోజకవర్గాల ఆర్వోలు, ఇతర అధికారులు పాల్గొ న్నారు.