రైతులకు 90శాతం సబ్సిడీతో నాణ్యమైన వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని, కందులు, పెసలు, అలసందలు, ఆముదం, జొన్న విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆద్వర్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారు శ్యామ్ రాయ్ కి వినతిపత్రం అందజేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ 2023 ఖరీఫ్ వర్షాభావం వల్ల పంటలు మొత్తంగా రైతులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలని కోరారు.