చనిపోయాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో అచ్యుత్ చదువుతున్నాడు.. బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. బుధవారం మధ్యాహ్నం న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. అచ్యుత్ అకాల మరణం బాధించిందని.. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ తెలిపింది. అచ్యుత్ మృతదేహాన్ని తిరిగి భారత్కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అచ్యుత్ది ఏ ఊరు, తల్లిదండ్రుల వివరాల వంటివి తెలియాల్సి ఉంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన అచ్యుత్.. ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.