ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేప చెట్టుకు కాసిన మామిడి పండ్లు.. మంత్రి ఇంట్లో ఇదెక్కడి విచిత్రం

national |  Suryaa Desk  | Published : Sun, May 26, 2024, 07:55 PM

వేప చెట్టుకు మామిడి పండ్లు కాయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఇంట్లో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వచ్చాయంటూ ఓ రాష్ట్ర మంత్రి స్వయంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఇదేలా సాధ్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే మొదట ఆశ్చర్యపోయిన ఆ మంత్రి.. తర్వాత శాస్త్రవేత్తలను పిలిపించి అసలు విషయం తెలుసుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది.


మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ నివాసంలో ఉన్న ఓ వేప చెట్టుకు.. మామిడి పండ్లు రావడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వేప చెట్టుకు వేలాడుతున్న మామిడి పండ్లకు సంబంధించిన వీడియోలను తీసిన మంత్రి ప్రహ్లాద్ పటేల్.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోయిన మంత్రి.. గతంలో నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని కొన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని పేర్కొన్నారు.


 ఆ వేప చెట్టు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని.. మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీఎం నివాసం తర్వాత అతిపెద్ద ఇల్లు ఇదే కావడం గమనార్హం. బీ-7 బంగ్లా భోపాల్‌లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్స్‌లో ఉంది. ఈ బంగ్లా చుట్టూ భారీగా మొక్కలు నాటారు. ఈ బీ-7 బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులను పరిశీలించేందుకు శనివారం అక్కడికి వెళ్లిన మంత్రి ప్రహ్లాద్ పటేల్‌కు మామిడి పండ్లు చూసి వీడియో తీసి పంచుకున్నారు.


ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మంత్రి.. వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. ఈ వేప చెట్టుకు పరిశీలించిన వృక్షశాస్త్రజ్ఞుడు ప్రతిభా సింగ్.. ఆ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చాలా సార్లు మామిడి గింజలు పెద్ద చెట్ల నుండి పడిపోయినప్పుడు.. మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com