ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో పాటు ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందు హాజరయ్యారు. ఐదు దశల్లో ఇప్పటి వరకూ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం అసెంబ్లీలతోపాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు / డి ఈఓలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎమ్ఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు.