రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.