కరెంట్ పోవడంతో ఉక్కపోతను భరించలేక సబ్‌స్టేషన్‌కు గ్రామస్థులు ఫోన్ చేశారు. అయినా, ఎలాంటి స్పందన లేకపోవడంతో అంతా కలిసి సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర రెడ్డి తప్పతాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నాడు. అది చూసిన గ్రామస్థులు ఆఫీసులో ఏంట పనులు అంటూ నిలదీశారు. ఇలాంటి ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు.
అసలే ఎండాకాలం.. ఆపై దారుణమైన ఉక్కబోత.. దీనికి తోడు రాత్రిపూట కరెంట్ కట్.. రాత్రి పదిగంటలకు పోయిన కరెంట్.. ఉదయం నాలుగైన రాలేదు. దీంతో ఆ ఊరులోని జనానికి చిర్రెత్తుకొచ్చింది. సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసి అసలు విషయమేంటో కనుక్కుందామని పలువురు ఫోన్లు కూడా చేశారు. కానీ అటువైపు నుంచి నో రెస్పాన్స్. ఎంతకూ ఫోన్ తీరాయె. దీంతో చిర్రెత్తుకొచ్చిన జనం.. అక్కడికే వెళ్లి తేల్చుకుందామని డిసైడ్ అయ్యారు. తెల్లవారుజామున కొంతమంది సబ్ స్టేషన్ వరకూ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన జనం.. ఆఫీసులో సీన్ చూసి నివ్వెరపోయారు. సబ్ స్టేషన్ సిబ్బంది ఊహించనిరీతిలో కనిపించడంతో షాక్ తిన్నారు.
ఓ ఉద్యోగి ఏకంగా ఆఫీసులోనే మహిళతో రాసలీలలు సాగిస్తూ పట్టుబడిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలో చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్లో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఓ మహిళతో ఆఫీసులోనే రాసలీలలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు రెడ్డి. బుధవారం రాత్రి పర్రెడ్డిగూడెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాత్రి మొత్తం కరెంట్ పోయింది. దీంతో ఏం జరిగిందీ తెలుసుకునేందుకు ఊరిజనం సబ్ స్టేషన్‌కు ఫోన్ చేశారు.
అయితే ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవటంతో తెల్లవారుజామున కొంతమంది సబ్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఇప్పటికే షిఫ్ట్ ఆపరేటర్ రెడ్డి.. మరో మహిళతో నగ్నంగా ఆఫీసులో కనిపించారు. ఫుల్లుగా మద్యం సేవించి.. ఆఫీసులోనే మహిళతో సన్నిహితంగా కనిపించారు. దీంతో ఊరిజనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆఫీసులో ఏంటీ పాడు పనులు అంటూ షిఫ్ట్ ఆపరేటర్‌ను నిలదీశారు. షిఫ్ట్ ఆపరేటర్ మీద పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత షిఫ్ట్ ఆపరేటర్ రెడ్డి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.