ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. భద్రత, ఆధునికీకరణ పనుల కారణంగా.. జూన్ 1న పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-సిల్చార్ (12513) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అంతేకాదు సంబల్‌పూర్ డివిజన్‌లో పలు రైళ్లు దారి మళ్లించి నడపనున్నారు.. వయా విజయనగరం, ఖుర్థారోడ్, కటక్, జాఖాపూర, జరోలి మీదుగా మళ్లించారు. దారి మళ్లించి రైళ్లలో..ఎర్నాకుళం-టాటా (18190).. జూన్ 7 నుంచి 14 వరకు టాటా-ఎర్నాకుళం(18189) రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లను జూన్ 6 నుంచి 12 వరకు దారి మళ్లించారు. ఈనెల 30న రాత్రి 11.40 గంటలకు సంత్రాగచ్చిలో బయలు దేరాల్సిన రైలు ఆలస్యంగా బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. సంత్రాగచ్చి-తాంబరం(06090) రైలు 3.10 గంటలు ఆలస్యంగా బయలు దేరేలా మార్పు చేసినట్లు ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించాలని.. ఆ మేరకు జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
మరోవైపు ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో స్పెషల్ రైలు నడుపుతోంది. జూన్ 22న సికింద్రాబాద్ నుంచి ఈ రైలు ప్రారంభంకానుంది.. అక్కడి నుంచి బయల్దేరి ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళుతుంది. తమిళనాడులోని అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూర్.. కేరళలోని తిరుచ్చి, త్రివేండ్రం వెళుతుంది. ఈ రైలు 30న తిరుగు ప్రయాణమై మళ్లీ సికింద్రాబాద్ చేరుకుంటుంది. రవాణా, హోటల్ గదులు, టీ, టిఫిన్, భోజనంతో కలిపి టికెట్టు ధరను నిర్ణయించారు. ఈ రైలులో స్లీపర్ తరగతిలో ఒక్కొక్కరికీ రూ.14,250 వేలుగా టికెట్ ధర నిర్ణయించారు. అదే థర్డ్ ఏసీలో రూ.21,900, సెకెండ్ ఏసీలో రూ.28,450గా టికెట్ ధర నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం ఉందని.. టికెట్ల బుకింగ్‌తో పాటుగా ఇతర వివరాల కోసం 8287932312 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.