ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై కోట్లల్లో బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు టాక్. ఇక జూన్ నాలుగో తేదీన ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేదీ జూన్ నాలుగో తేదీ కౌంటింగ్‌తో తేలిపోనుంది. మరోవైపు కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో ఇప్పుడు సరికొత్త వివాదం మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌పై వైసీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఈసీ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టులో కూడా సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు (శనివారం) సాయంత్రం కీలక ఆదేశాలు జారీచేయనుంది.
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది ఏపీ హైకోర్టు.. దీంతో.. రేపు సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠగా మారింది..
మరోవైపు కౌంటింగ్ దగ్గర పడుతున్న తరుణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా కూడా అనుమతించాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి సంతకం ఒక్కటే ఉంటే సరిపోతుందంటూ ఆదేశాలు జారీచేసింది. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. అలాగే 13ఏ మీద అటెస్టింగ్ అధికారి పేరు, వివరాలు లేకున్నా కూడా చెల్లుతుందంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు సీఈసీ ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కూడా జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆర్వో సీల్ లేకున్నా అనుమతించాలనే నిబంధనను వైసీపీ వ్యతిరేకిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై దేశమొత్తం ఒక నిబంధన ఉంటే.. ఏపీకి మాత్రమే ఎందుకు సడలింపులు ఇచ్చారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్‌పై ఆర్వో సీల్ లేకపోయినా ఓటును తిరస్కరించవద్దంటూ ఇచ్చిన మెమో సమంజసం కాదని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ విచారించింది.
పిటిషన్ విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. మే ఒకటో తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటలకు ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైన నేపథ్యంలో.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.