కౌంటింగ్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శిరీష తెలిపారు. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెంట్ల వివరాలను ఆయా పార్టీల నాయకులు జూన 1లోపు తమకు అందజేయాలన్నారు. నాలుగున ఉదయం 6గంటలకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. కేంద్రంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తేవాలన్నారు. అనంతరం సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆమె ఈవీఎంలను ఓపెన చేయడం, కౌంటింగ్ చేయడం తదితర వాటిపై అవగాహన కల్పించారు. సమావేశంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్రప్రసాద్, రాజా పాల్గొన్నారు.