డీ.హీరేహాళ్ మండల కేంద్రంలోని పలు మందుల దుకాణాలు, ప్రథమ చికిత్స కేంద్రాలను వైద్యాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య విద్య బోధకుడు కెంచె లక్ష్మీనారాయణ ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాపులు, ప్రథమ చికిత్స కేంద్రాలలో అనుమతులు లేకుండానే డాక్టర్ల పేరుతో వైద్యం అందిస్తూ భారీ మొత్తంలో యాంటీబయాటిక్స్ ఇతర మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండానే మెడికల్ షాపులను నడుపుతున్నట్లు కూడా గుర్తించారు. అలాంటి వాటికి నోటీసులు జారీ చేశారు. ఆర్‌ఎంపీ ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, విచ్చలవిడిగా అనుమతులు లేని మందులు విక్రయింపజేసి, వైద్యం చేయరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.