ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ నెల 21 నుంచి ఉత్సవాలు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆమిద్యాలకు తీసుకెళ్లారు. ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఉత్సవమూర్త్తులను ఆమిద్యాలకు తీసుకెళ్లడం ఆనవాయితీ. ఆమిద్యాలలోని పెన్నోబులేశుడి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ్‌కుమార్, అర్చకులు ద్వారకనాథాచార్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.