ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న పొగాకు వినియోగాని నివారించేలా ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలని అరసవల్లి డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రసాదరావు పిలపునిచ్చారు. ఈ మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ, జాతీయ పొగాకు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. పొగాకు వినియోగాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దామన్నారు. 20 రోజుల పాటు పొగాకు వినియోగాన్ని రూపుమాపే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సంద ర్భంగా మానవ హారంగా ఏర్పడి పొగాకు వినియో గా నికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, నినాదాలు చేశారు. కార్యక్ర మంలో డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ లక్ష్మి, జిల్లా మాస్ మీడి యా అధికారి పైడి వెంకటరమణ, అధికారులు రవి ప్రసాద్, సురేష్, అప్పారావు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రెడ్‌క్రాస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.