మామిడికుదురు,పెదపట్నలంక గ్రామానికి చెందిన యేడిద సాయిబాబు (48) వడ్రంగి పని జీవన ఆధారంగా జీవిస్తున్నాడు. సాయిబాబు గురువారం రాత్రి పని ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తరువాత బహిర్భూకి వెళ్లి ఎంత సేపటికీ తిరిగి రాలేదు. భార్య దుర్గాభవానీకి అనుమానం వచ్చి స్థానికుల సాయంతో గాలించింది. సాయిబాబు మోటబావిలో పడి కొట్టుమిట్టాడుతుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి బావిలో దిగి సాయిబాబును బయటకు తీశారు. స్థానికులు అతడికి సీపీఆర్ చేశారు. 108అంబులెన్సు సిబ్బంది వచ్చి సాయిబాబును పరీక్షించి అప్పటికే అతడు మృతిచెందినట్టు నిర్థారించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్టున్నటట్టు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడదని, భర్త మృతితో తాము సర్వం కోల్పోయామని భార్య దుర్గాభవాని, ఇద్దరు కుమార్తెలు తనుశ్రీ, కావ్యశ్రీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.