ఇక మూడురోజులే ఉంది.ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా నడుస్తున్నాయి. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. మంగళవారం ఉదయం 4.30 గంటల నుంచే సంబంధిత ఓట్ల లెక్కింపు అధికారులు అక్కడకు చేరుకుంటారు. రాజమండ్రి జిల్లాలో మొదటి ఫలితం కొవ్వూ రు అసెంబ్లీ నియోజకవర్గానిదే అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఫలి తాలు వెలువడే అవకాశం ఉంది.రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఫలితం చివరిలో వస్తోంది. ఇదిలా ఉండగా కొన్నేళ్లుగా ఎగ్జిట్‌పోల్ సర్వే ఫలితాలతో కాస్త ఊరట పొందడం అలవాటైపోయిం ది. దీనికి కారణం కొన్ని ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిజం కావడం. కౌంటింగ్ రోజు కంటే ముందుగానే ఒక విధంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది, ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాలను ఈ ఎగ్జిట్‌పోల్ సర్వేలు స్పష్టం చేస్తుంటాయి. గతంలో పోలింగ్ జరిగిన వెంటనే ఈఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ప్రకటించే వారు.కానీ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతుండడంతో అన్ని ప్రాం తాల్లో ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ప్రకటించకూడదనే ఆంక్షలను ఎన్నికల కమిషన్ విధించింది.దీంతో అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాతే వీటిని ప్రకటిస్తారు. దేశంలో మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలను ప్రకటించారు.ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు జరిగిపోయాయి. శనివారం ఏడో విడత అంటే చివరి విడత పోలింగ్ జరగనుంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరనుంది.ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశవ్యాప్తంగా విడుదల చేస్తారు. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తారు. దీంతో చాలా వరకూ టెన్షన్ తగ్గినట్టు అవుతుంది. గెలిచేవారిలో ఆనందం పెరిగిపోతుంది. ఓటమి చెం దేవారిలో వణుకు మొదలవుతుంది. చివరి ఫలితం 4న వెలువడుతోంది.