కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న 180 కార్మికులను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రెండు సంవత్సరాల క్రితం కాలువల్లో పూడిక తీసేందుకు నియమించుకున్న కార్మికులను విధులకు హాజరుకావద్దని అధికారులు చెప్పి నట్లు తెలిసింది. జూన్ 1 నుంచి విధుల్లోకి రావద్దని శుక్రవారం అధికా రులు చెప్పడంతో కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో దిక్కుతో చని పరిస్థితుల్లో అధికారులు అప్పటిక ప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే తొలగించాలని అనుకున్న అధికారులకు కౌన్సిల్ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆగిపోయారు. ప్రస్తు తం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌన్సిల్ సభ్యుల ఆమో దం లేకుండానే కార్మికులను తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.