పొగాకు తిన్నా, ధూమపానం చేసినా ఆరోగ్యానికి హానికరమని మదనపల్లె ప్రభుత్వ బోధనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ ఎం.ఎస్.రాజు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ఆస్పతి నుంచి పట్టణంలో వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రాజు మాట్లాడుతూ దూమపానం చేసే వారి చుట్టుపక్కల వున్న వారికి కూడా ఈ పొగతో ఆరోగ్యం దెబ్బతింటుం దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పొగాకు పదార్థాల వినియోగం నిలిపి వేసేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్ర మంలో డాక్టర్లు ప్రసాదరాజు, రాధిక, విష్ణువ ర్ధన్, జ్యోత్స్న, భారతి, సురేష్, ఈశ్వర్, అలేఖ్య, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.