విశాఖపట్నం కేజీహెచ్‌లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలోని విభాగాధిపతులతో సమావేశ మయ్యారు. సూపరింటెండెంట్ కార్యాలయం పైఅంతస్థులో గల కాన్ఫరెన్స్‌లో హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన సుమారు గంటపాటు వైద్యులతో మాట్లాడారు. ఆస్పత్రిలో నెలకొన్న తాజా పరిస్థితులను వైద్యులు పట్టించు కోవద్దని, రోగులకు మెరుగైన సేవలను అందించడంపై దృష్టిసారించాలన్నారు. కొద్దిరోజుల్లో ఈ వివాదాలన్నీ సద్దు మణుగుతాయని, ఈలోగా ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించాలని ఆదేశించారు. న్యాయ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు డాక్టర్ శివానంద సూపరింటెండెంట్‌గా కొనసాగు తారని, విభాగాలకు సంబంధించిన అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని, విధులను సక్రమంగా నిర్వర్తించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో వివాదాలు తలెత్తడానికి గల కారణాలు గురించి కొందరు వైద్యు లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏఎంసీ ప్రిన్సి పాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు, కేజీహెచ్ ఇన్‌చార్జి సూప రింటెండెంట్ డాక్టర్ కె.శివానందతోపాటు పలు విభాగా ధిపతులు పాల్గొన్నారు.