తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి సోమవారం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారింది. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు మరికాసేపట్లో సమావేశం కానున్నట్లు సమాచారం. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరిగిన విషయం తెలిసిందే. రేపు(మంగళవారం) ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో కూటమి పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేతలకు పలు సూచనలు, సలహాలు చంద్రబాబు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులతో పాటు ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్న రాద్దాతం అంతా ఇంతా కాదు. అ విషయంలో టీడీపీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa