దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్. ఓ విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు. 2014లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ప్రజాపాలన అందించడంలో విఫలమైంది. వైసీపీ అరాచకాలకు విసుగుచెందిన చంద్రబాబు.. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసిన సమయంలో ఎంతోమంది ఎగతాళి చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదంటూ హేళన చేశారు. వాటన్నింటిని టీడీపీ అధినేత పట్టించుకోలేదు. ప్రజలనే నమ్ముకుని.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బాబుపై విశ్వాసం ఉంచిన ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు.