పీలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి భారీ విజయాన్ని చేజిక్కించుకోవడంతో మండలంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాయచోటి కౌంటింగ్ కేంద్రం నుంచి స్వస్థలం కలికిరి చేరుకోవలసి వుండగా దారి పొడవున్నా భారీగా పార్టీ శ్రేణలు స్వాగతం పలికారు. పదేళ్ళ తరువాత ఎన్నికల్లో కిశోర్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో మండలంలోని అన్ని గ్రామాల్లోనూ బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చి న వారితో గ్రామం కిటకిటలాడింది. పీలేరు, కేవీ పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా నగరిపల్లె చేరుకుని సంబరాల్లో పాలుపంచుకు న్నారు. కిశోర్‌కుమార్ రెడ్డి సతీమణి తనూజా రెడ్డి, కుమార్తె డాక్టర్ వైష్ణవి, కోడలు డాక్టర్ షమా రెడ్డిలతో కలిసి విజయ సంకేతాలు తెలుపుతూ పరస్పరం అభినందించుకున్నారు.