పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో కేవలం 6 వేల ఓట్లతో బయటపడినా నైతికంగా ఓడిపోయి నట్లేనని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు పేర్కొ న్నారు. గురువారం మంగళగిరి నుంచి మదనపల్లెకు వచ్చిన శ్రీరామ్‌చినబా బుకు స్థానిక నీరుగట్టువారిపల్లెలో తెలుగు యువత నాయకులు, టీడీపీ నాయకులు, చేనేత కార్మికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో చినబాబు మాట్లాడుతూ వైనాట్ 175 అంటూ భీరాలు పలికిన జగనకు ఎన్నికల ఫలి తాల్లో రెండంకెలు మాత్రమే వచ్చాయన్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగనకు ఈ సంఖ్య మధ్యలో 5 తీసేసి కేవలం 11 ఇచ్చారన్నారు. ఐదేళ్ల అరాచకపాలనలో టీడీపీ కార్య కర్తలపై అక్రమ కేసులు పెట్టారని దీని పర్యవసనమే దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారన్నారు. మదనపల్లెలో ఎమ్మెల్యేగా షాజహానబాషాను గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నామ న్నారు. ఎమ్మెల్యేతో చర్చించి మదనపల్లె అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడెం సిద్దప్ప, యోగేశ్వర్‌బాబు, రాటకొండ మధుబాబు, దొరస్వామినాయుడు, చీకిలబైలు సర్పంచ ప్రభాకర్, నాదెళ్ల అరుణ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు.