ఏపీ నుంచి షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు తెలిపారు. ఈనెల 30వ తేదీ నుంచి గుంటూరు-ఔరంగాబాద్-గుంటూరు మధ్య రైలును ప్రారంభించాలని దక్షిణ మధ్య.రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో ఉదయం 07.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 13.20 గంటలకు ఔరంగాబాద్‌కు చేరుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో (17254) ఔరంగాబాద్‌లో సాయంత్రం 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటిరోజు రాత్రి 21.30 గంటలకు చేరుతుంది.
ఈ రైలు ప్రారంభంకానుండటంతో భక్తులు గుంటూరు నుంచి నేరుగా వెళ్లే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ రైలును (17253) ప్రస్తుతం గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడుపుతున్నారు.. ఇప్పుడు దానిని ఔరంగాబాద్‌కు పొడిగించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, పేరేచర్ల, నరసరావుపేట, వినుకొండ, కురిచేడు, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, గాజులపల్లి, నంద్యాల, కృష్ణమ కోన, బేతంచర్ల, రంగాపురం, డోన్, బోగోలు,వెల్దుర్తి, ఉలిందికొండ, దూపుడు, కోట్ల, కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది.