దోమల వలన వ్యాపిస్తున్న మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలగాలని జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తాడేల శ్రీకాంత్ తెలిపారు. బుధవారం జలుమూరు మండల కేంద్రంలోని మలేరియా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం దోమల మందును పిచికారి చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.