శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలో నిర్మించిన రైతుభరోసా కేంద్రం వద్ద శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. గది తాళాన్ని పగలగొట్టి లోపల ఉన్న ఫ్యాన్‌ను అపహరించారు. టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని, దీనిపై ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. మండలంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వైఎస్సార్సీపీ కనీ్వనర్ పోతురాజు, జేసీఎస్ కనీ్వనర్ ధనకోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.