అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో శృంగవరం గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. సచివాలయంపై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బొమ్మలతో పాటు నవరత్నాల పోస్టర్ను ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గసభ్యుడు, సర్పంచ్ భర్త ఉలబాల శ్రీనువాసు పేర్కొన్నారు. కోర్టు వివాదంలో ఉన్న ప్రభుత్వ భవనం తాళం విరగొట్టి టీడీపీ కార్యకర్తలు ప్రవేశించటం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు.