నేటితో వేసవి సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2024–25 పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి విద్యార్థుల చేరికలు మొదలు కానున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 2024–25 విద్యా సంవత్సరంపై ప్రభావం చుపుతుందా..? లేక మెరుగు పడుతుందా ? అనేది ఈసారి పాఠశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్ణయించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్‌లు, షూలు ఇప్పటికే పాఠశాలలకు చేరిపోవాలి. ఈ నెల 12వ తేదీ నాటికి విద్యా సామగ్రి అందాల్సి వుండగా వాయిదా వేశారు. మండలాల వారీగా విద్యాసామగ్రి చేరడం పూర్తయ్యింది. ప్రైమరీలోనే ఇంకా కొన్ని పుస్తకాలు రావాలి. మిగిలినవన్ని పూర్తిస్థాయిలో వచ్చాయి.