శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలంలోని చీడివలసకు చెందిన కె.అప్పలనాయుడు ఇంట్లో చోరీ జరిగినట్టు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు 4.5 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని క్లూస్‌టీమ్ పరిశీలించిందని సీఐ దివాకర్ యాదవ్, ఎస్ఐ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.