అనంతపురం జిల్లా, గోరంట్ల మండలంలోని ఎర్రబల్లిలో గంగమ్మ జాతర వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యం లో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41రోజులు కావడంతో జాతర చేశారు. మ హిళలు జ్యోతుల ను తలపై ఎత్తుకుని ఊరే గింపుగా ఆలయం వర కు తీసుకొచ్చిఅమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, శాంతి పూజలు జరిపారు. గ్రామస్థులందరూ జాతరలో పాల్గొన్నడంతో పండుగ వాతావరణం నెలకుంది.