చంద్రబాబునాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ ప్రజల అదృష్టమని గుంటూరు టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన కళ్యాణ్ ప్రకటించిన సంద ర్భంగా ఆయన ఆధ్వర్యంలో బీసీ నాయకులు హిందూ కాలేజీ సెంటర్లోని జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి విజ యోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకై నిరంతరం తపించే నిత్య కృషీవలుడు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన కళ్యాణ్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ బీసీ నాయకుడు డాక్టర్ నిమ్మల శేషయ్య, చావలి శ్రీనివాసరావు, హనుమంత రాజు, రాచకొండ లక్ష్మయ్య, సూరే శ్రీనివాస్, దేవేళ్ళ మల్లికార్జునరావు, వేంపాటి విజయలక్ష్మి, మేకపోతుల సోమశేఖర్, గుంటి నరసింహారావు, దాసరి రావణ్, మోకరాల రాము, నల్లమేకల శ్రీనివాసరావు, మహేంద్ర తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.