ఈనెల 17వ తేదీన బక్రీదు పండుగ సందర్భంగా ఒంగోలు జిల్లాలో ఆవులు, లేగదూడల సామూహిక వధ జరిగితే అటువంటి వా రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ కె.బేబీరాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఆవులు, లేగదూడలను వధించటం జంతు హింస నివారణ చట్టం 1960, ఆంధ్రప్రదేశ్ గోవధ నిరోధక చట్టం 1977, పశువుల రవాణా నియామవళి 1978, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన వివిధ రకాల ఉత్తర్వులు ప్రకారం చట్ట విరుద్ధమన్నారు. జిల్లాలో ఇలాంటి చర్యలకు ఉపక్రమించినా, సహకరించిన వారందరూ శిక్షార్హులని పేర్కొన్నారు. అందువల్ల దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరూ సామూహిక వధ కోసం పశువులను అమ్మకూడదని, వాటి రవాణాలో పాలు పంచుకోవద్దని ఆమె స్పష్టం చేశారు.