నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ప్రమాదాల నివారణకు స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసన్నపేట సి. ఐ బి. ప్రసాద్ రావు సోమవారం వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అయి ఉండి సమాజ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |