బూర్జ మండలం కొల్లివలస నుంచి రాజుపేటకు వెళ్లే ప్రధాన రహదారివద్ద రోడ్డుకి అడ్డంగా చెట్టు పడిపోయి ఉందని స్థానికుల సోమవారం తెలిపారు. ఇటీవలే వీచిన ఈదురు గాలులకు చెట్టు నేలకు ఒరిగిందని పేర్కొన్నారు. ఈ కారణంగా వాహనదారులకు కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెట్టును తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
![]() |
![]() |