ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటన ఖరారైంది. నేడు ఉదయం 11.45 గంటలకు పోలవరానికి చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టులో వివిధ భాగాలను సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్షిస్తారు.