వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనకబడ్డాయన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్డీయే పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీస్తామన్నారు. ప్రతి ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సత్యకుమార్. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.