చీరాల రైల్వే స్టేషన్ లో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల 4, 5 ప్లాట్‌ఫారమ్ లకు కలిపి ఏర్పాటు చేసిన కరెంటు జంక్షన్ బాక్స్ నుండి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో 5వ నెంబర్ ప్లాట్ ఫారం మీద గూడూరు-విజయవాడ పాసింజర్ ట్రైన్ కూడా ఆగి ఉంది. అధిక శబ్దంతో నిప్పురవ్వలు రాలి పడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.