తాజా ఎన్నికల్లో గెలుపొందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ను అభినందించేందుకు వచ్చేవారు పూలమాలలు, పుష్పగుచ్చాలు తేవడానికి బదులు పూల మొక్కలు, నోట్ బుక్స్, వంటివి తీసుకురావాలని ఆయన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. పుష్పగుచ్చాలు, పూలమాలలు వృధా అయిపోతున్నాయని, పూల మొక్కలయితే పర్యావరణానికి దోహదపడతాయని, ఇతర చిన్న బహుమతులయితే నలుగురికి ఉపయోగపడతాయని ఆ ప్రకటనలో వివరించారు.